Constable Candidates Protest: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు పోలీసులు.. ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మురి వెంకట్, కార్పొరేటర్ విజయ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు.. అయితే, మాకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.. 1600/800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు.. లాంగ్…
జగిత్యాలలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్బందంకు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ వద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు.
పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం నేతలు గురువారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వచ్చిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనకు నిరసనగా రైతులు గురువారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. వీరితో పాటు వీడీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సోమవారం నాడు అన్ని జిల్లాల కేంద్రాల్లో టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వెల్లడిచారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫించనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. దాచుకున్న డబ్బును కూడా తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు చేయకుండా పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శలు చేశారు.…
Andhra Pradesh: ఏపీలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వీఆర్వోలు వెల్లడించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం నేత భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
Andhra Pradesh: అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు మరోసారి నిరసన తగిలింది. ఎమ్మెల్యే కన్నబాబు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దొప్పెర్ల గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎమ్మెల్యే వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు సీఎం జగన్ వరకు చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో దొప్పెర్ల…