Kamareddy New Master Plan: కొత్త మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోకపోతే ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy New Master Plan: కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనకు నిరసనగా రైతులు గురువారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. వీరితో పాటు వీడీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌పై గత నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంట పొలాలను పారిశ్రామిక వాడలకు గుర్తించారనే మనస్తాపంతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తమ పొలాలను పరిశ్రమలకు కేటాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రాము ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు రాజీనామాలు సమర్పించారు.
Read also: Harish Rao: పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు.. వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసు
Also Read
కొత్త మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సుమారు ఎనిమిది గ్రామాల రైతులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ముట్టడికి రైతులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు.. కొత్త మాస్టర్ ప్లాన్ అంశాన్ని వెనక్కి తీసుకోకుంటే ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?