కూడు కోసం పోడు భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తు జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలు వాళ్లు . దాదాపు 30 సంవత్సరాలుగా పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న ఎల్లన నగర్ వాసులు. చంటి పిల్లలతో సహా 18 మంది మహిళలు జైలుకు వెళ్ళారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయమైన ఎల్లన నగర్ గ్రామ రైతులు మహిళలు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని ఎల్లన నగర్ గ్రామంలో సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు రైతులు వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్ఎస్పి కెనాల్ నందు నీటిలోకి దిగి జల దీక్ష కార్యక్రమం చేపట్టారు. పోడు సర్వే చేస్తారా చావమంటారా ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 30 సంవత్సరాల నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పోడు భూములను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు.
తమపై కొందరు అధికారులు తప్పుడు నిర్ణయాల వల్ల తమ గ్రామంలో నిర్వహించవలసిన పోడు సర్వే ఇప్పటి వరకు నిర్వహించలేదని మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసిన తమగోడు చెప్పిన పట్టించుకునే వారే లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో పోడు సర్వే నిర్వహించాలని అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు, . సిపిఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి కంకణాల అర్జున్ రావు డిమాండ్ చేశారు.
Read Also: IT Companies Q3 Performance: సంతోషంగా సెండాఫ్.. ఆనందంగా ఆహ్వానం..