Sachin Tendulkar: భారతరత్న తిరిగి ఇచ్చేయాలంటూ సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Bachchu Kadu protests at Sachin Tendulkar’s home: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసన చేప్టటినందుకు గానూ ఒక ఎమ్మెల్యే పాటు 22 మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ కార్యకర్తలతో కలిసి నిన్న ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన చేపట్టారు.
Also Read: Uttarpradesh: కేంద్రమంత్రి ఇంట్లో శవం..కొడుకు పైనే అనుమానం
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
సచిన్ టెండూల్కర్ ఆన్ లైన్ గేమింగ్ యాప్ ‘డుబియస్’ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంటూ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉంటూ భారతరత్న పొందిన సచిన్ ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం సరికాదన్నారు. ‘బ్యాటింగ్ టు బెట్టింగ్’ సచిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నందకు భారత రత్నను వెనక్కి ఇచ్చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎంతో మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అధిక వడ్డీలకు డబ్బులు అప్పు తెచ్చి మరీ దీనిలో పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు.
యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం సిగ్గుచేటని అన్నారు.ఆన్‌లైన్ గేమ్‌ను ఎండార్స్ చేస్తున్న సచిన్.. లోకల్ గేమ్ అయిన మట్కాను ఎందుకు వదిలేశారని ఎద్దేవా చేశారు కడూ. ఎంతో ఉన్నతమైన భారతరత్న అవార్డును అందుకున్న వారు ఎండార్స్‌మెంట్ల నుంచి లాభం పొందటం కోసం ఎలాంటి వాటినైనా ప్రమోట్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనల నుంచి సచిన్ తప్పుకోకుంటే గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించే ప్రతి గణేశ్ మండపం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేతో సహా 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై సెక్షన్37 (నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన), 135 (చట్టాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?