ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తన నివాసాన్ని పల్లెటూరి గ్రామంగా తీర్చి దిద్దారు. సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.
జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఎల్‌జీ మనోజ్ సిన్హా హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిగా ఉన్నప్పటికీ.. గత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ మధ్య చాలా మంచి సమన్వయం కనిపించింది.
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రారంభిస్తారు.
ప్రధాని మోడీని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల.. సోమవారం ప్రధాని మోడీని కలిశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని సత్య నాదెళ్ల ప్రకటించారు.
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పార్లమెంటు లోపలా, వెలుపలా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.