జమ్మూ కాశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఎల్‌జీ మనోజ్ సిన్హా హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిగా ఉన్నప్పటికీ.. గత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ మధ్య చాలా మంచి సమన్వయం కనిపించింది. సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ఒమర్ అబ్దుల్లా నరేంద్ర మోడీని కొనియాడారు. మీరు మీ వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. మీరు కాశ్మీర్, ఢిల్లీ మధ్య హృదయ దూరాన్ని తగ్గించారన్నారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: పల్లె సౌభాగ్యమే.. దేశ సౌభాగ్యం.. భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “మీరు ఈ సొరంగాన్ని ప్రారంభించడం మా అదృష్టం. ఈ ప్రాజెక్ట్‌లో చాలా అడ్డంకులు ఉన్నప్పటికీ.. మీరు, నితిన్ గడ్కరీ పనిని వేగంగా పూర్తి చేశారు. ఇప్పుడు సంవత్సరంలో 12 నెలలూ ఇక్కడికి పర్యటకులు వస్తారు. కాశ్మీర్ దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతి నెలకొంది. దీంతో మారుమూల ప్రాంతాలకు సైతం ప్రజలు చేరుకుంటున్నారు. ఇప్పుడు సోనామార్గ్‌కు కూడా చాలా మంది వస్తారు. జోజిలా టన్నెల్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.” అని సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE:Bhatti Vikramarka: తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు..
ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎక్కడా రిగ్గింగ్ లేదా అవాంతరాలు జరిగినట్లు ఫిర్యాదులు లేవని వెల్లడించారు. దీని ఘనత మోడీకి, సహచరులకు, ఎన్నికల కమిషన్‌కు చెందుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వడం గురించి కూడా ఆలోచించండి. ఈ వాగ్దానాన్ని త్వరలో నెరవేరుస్తారన్నారు.