TG Venkatesh: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. గోదావరి జలాలు రాయలసీమకు తీసుకురావడానికి చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెబుతున్నాం అన్నారు.. ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై పరిష్కారానికి సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.. ఆస్తుల విభజనలో ఏపీకి న్యాయం జరిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఆలోచించాలని సూచించారు.. ఇక, రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: WPL 2025: మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్‌డౌన్.. టోర్నీ షెడ్యూల్ ప్రకటన
ఏపీ దివాళా పరిస్థితిలో ఉంది.. ఏపీలో ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు హెడ్ ఆఫీస్‌లు తెలంగాణలో పెట్టుకొని పన్నులు అక్కడే చెల్లిస్తున్నారు.. వారు ఏపీలోనే పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు టీజీ వెంకటేష్.. రాయలసీమలో వేల కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు.. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.. సీమ ఎత్తిపోతల పథకం అనుమతి లేకుండా నిర్మించే ప్రయత్నం చేశారు.. వందల కోట్లు వృథా ఖర్చు చేశారు.. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Read Also: Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన.. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలింపు!
ఇక, ముస్లింలు, క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదు.. మతమార్పిడి హిందూమతంలో లేదన్నారు టీజీ వెంకటేష్.. ఆలయాలపై దాడులు చేస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించిన యాన.. ఆలయాలపై దాడుల వెనుక రాజకీయమా, మతపరమైన అంశాలా? తేల్చాలన్నారు.. ఆర్యవైశ్యులపై దాడులు పెరుగుతున్నాయి.. ఆర్యవైశ్యులపై దాడులు చేసిన వారిని రోడ్డుపైకి లాగుతాం అని హెచ్చరించారు.. డోన్ లోఆర్యవైశ్యులపై దాడి చేయడం అన్యాయం అన్నారు.. మరోవైపు.. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది.. ప్రాజెక్టులు పూర్తి చేస్తుందనే నమ్మకం కలిగిస్తోంది అన్నారు టీజీ వెంకటేష్..