ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటూనే విద్యార్థులు చదువుకోవాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. పరీక్షా పే చర్చ సందర్భంగా మోడీ ఒక వీడియోను ఎక్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ప్రధాని మోడీ సోమవారం రెండు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఏఐ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు.
Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు (ANR) 100వ జయంతిని పురస్కరించుకుని "మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ" అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు సందర్శిస్తు్న్నారు. ప్రపంచ దేశాల నుంచి సైతం భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. కోట్లాది మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు(ఫిబ్రవరి 5) కుంభమేళాను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రయాగ్ రాజ్ కు చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర…
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు అంచనాలు పెట్టుకున్నాయి. ఎవరికి వారు బడ్జెట్ తమ ఆశలకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న సామాన్యులు కీలక మార్పులు ఉండొచ్చని ఆశిస్తున్నారు. ధరలకు కళ్లెం పడాలని.. ఆర్ధిక భారం తగ్గాలని కోరుకుంటున్నారు.
PM Modi : వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో మాట్లాడతారు.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్..
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిషన్రెడ్డి తన నివాసాన్ని పల్లెటూరు మాదిరిగా అందంగా అలంకరించారు. కార్యక్రమానికి హజరైన ప్రధానికి ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య మోడీ వేడుక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడీ తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.…