CPI Narayana: మోడీ గ్రాఫ్ తగ్గ కూడదు అని.. అద్వానీని పిలవడం లేదని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై.. సీపీఐ పరిస్థితి, తిట్టపోతే అక్క కూతురు, కొట్టపోతే కడుపుతో ఉంది అన్నట్టు ఉందని వ్యంగావస్త్రం వేశారు. బీజేపీ పార్లమెంట్ పై దాడి ని ఉద్దేశ్య పూర్వక డ్రామా చేసిందని మండిపడ్డారు. జనవరి 22 న అయోధ్య ప్రారంబించి ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్లాన్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అద్వానీ లేకుండా బాబ్రీ కూల్చలేదా..? అని ప్రశ్నించారు. ఆయన్ని ఉద్దేశపూర్వకంగా అద్వానీ ని రామ మందిరం ప్రారంభోత్సవం కి రావద్దని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ గ్రాఫ్ తగ్గ కూడదు అని.. అద్వానీ ని పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని మీద ఈగ వాలినా..మోడీ..అమిత్ షా కి నష్టం అని తెలిపారు. కాబట్టి ఆదానిని కాపాడే పనిలో ఉన్నారని అన్నారు. కేంద్రం దేవుణ్ణి..క్రిమినల్ ఆక్టివిటీ ఉన్న వాళ్ళను పక్కన పెట్టుకోవాలని చూస్తుందని తెలిపారు. ఏపీలో బీజేపీ.. చంద్రబాబు కలిసి పోటీ చేయాలని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి బలపరిచే లా రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Read also: RTC MD Sajjanar: అద్దె బస్సుల యజమానులతో ముగిసిన భేటీ.. సజ్జనార్ ఏమన్నారంటే..?
షర్మిలను ఏపీ కాంగ్రెస్ తీసుకుని జగన్ ని భయపెట్టారని అన్నారు. జగన్ ఆయన కొంపలో ఆయనే నిప్పు పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లెక్కనే.. జగన్ పోవాలి అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్.. జగన్ భేటీ వ్యూహంలో భాగమే అన్నారు. పోలింగ్ డే రోజు.. తెలంగాణతో గొడవ పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. అప్పుడు నీకు సహకారం చేశా.. ఇప్పుడు మీరు సహకారం చేయండి అని చెప్పడానికి వచ్చారు జగన్ అన్నారు. మొన్న ఎన్నికల్లో.. సీపీఐ..సీపీఎం కలిసి పని చేయాలని అనుకున్నామన్నారు. నిచ్చితార్థం వరకు అయ్యింది..కానీ పెళ్లి దగ్గర ఆగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చిందని అన్నారు. అయినా వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని హోదాలో రిలీజియన్ వ్యవహారాల్లో పాల్గొనకూడదు కానీ మోడీ వెళ్తున్నారని అన్నారు.
Dwarampudi Chandrasekhar Reddy: పవన్ కల్యాణ్ ఎన్ని సమీక్షలు చేసినా ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్