హీరో కంపెనీ నుంచి ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ విడుదల అయింది. ఈ మోడల్ బైక్లో కంపెనీ కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. స్పెసిఫికేషన్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే.. లుక్, డిజైన్ చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి. Xtreme 160R 2V సింగిల్ డిస్క్ వేరియంట్‌తో స్టీల్త్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ బైక్ ధర రూ.1,11,111 ఎక్స్-షోరూమ్.
టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్‌ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్‌లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
భారత మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ 2024 క్లాసిక్ 350 వచ్చేసింది. మార్కెట్లో రూ. 1.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. దీని టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ. 2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. రీ మోడల్ చేసిన ఈ బైక్ లో ఇప్పటికే ఉన్న మెకానికల్ భాగాలను కొనసాగిస్తూ కొత్త రంగు ఎంపికలు, ఎక్స్ట్రా పార్ట్స్ను యాడ్ చేశారు. కొత్త 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బుకింగ్.. టెస్ట్ రైడ్‌లు సెప్టెంబర్ 1…
ప్రసిద్ధ బ్రిటిష్ బైక్ తయారీదారు బీఎస్ఏ (BSA) బైక్స్.. తన ప్రొడక్ట్ను 2021లో ప్రపంచవ్యాప్తంగా రీ మోడలింగ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. బీఎస్ఏ బైక్స్ తన మొదటి ఆఫర్ గోల్డ్ స్టార్ 650ని విడుదల చేసింది. హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ. 3 లక్షలు
బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్ 3201 ధర రూ. 1.29 లక్షలు. కాగా.. ఈ స్కూటర్ ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే.. కొత్త చేతక్ 3201 డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌ల రూపంలో ప్రత్యేక అప్‌గ్రేడ్‌లను పొందింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కర్వ్ ఈవీని రూపొందించింది. టాటా కర్వ్ ఎలక్ట్రికల్ వెహికల్ (EV)ను వచ్చే నెల (ఆగస్ట్ 7)న విడుదల చేయనున్నారు. ఈ కారు ఇంటీరియర్.. కొత్త ఎలక్ట్రిక్ కూపే SUV దాని అండర్‌పిన్నింగ్‌లను నెక్సాన్‌తో పంచుకుంటుంది. ఇంటీరియర్ దాని సబ్‌కాంపాక్ట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి.
రెడ్ మీ (Redmi) తన కస్టమర్ల కోసం కొత్త ఇయర్ బడ్స్ని పరిచయం చేసింది. రెడ్ మీ బడ్స్ 5C.. వైర్‌లెస్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుంది. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అనేక ప్రత్యేక ఫీచర్లతో ముందుకు వస్తుంది. అంతేకాకుండా.. ధర కూడా తక్కువే ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా.. 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉంది.
మీరు మంచి కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. హానర్ నుండి వస్తున్న స్మార్ట్ ఫోన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 200MP కెమెరాతో కలిగి ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో విక్రయించబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.12,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అమ్ముతుంది. ఈ ఫోన్ ప్రత్యేకత దాని కెమెరా, ర్యామ్. మీరు 25,000 రూపాయలకు మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఫోన్ మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల…
Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కంపెనీ Y-సిరీస్‌లో భాగమైంది. Vivo Y58 5G ఫోన్.. ప్రీమియం వాచ్ వంటి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, సూపర్ క్వాలిటీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. బ్యాటరీ సామర్ధ్యం 6000mAh ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి ఇప్పుడు…
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని..…