బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్ 3201 ధర రూ. 1.29 లక్షలు. కాగా.. ఈ స్కూటర్ ఈ నెల 5వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే.. కొత్త చేతక్ 3201 డిజైన్, ఫీచర్ అప్‌డేట్‌ల రూపంలో ప్రత్యేక అప్‌గ్రేడ్‌లను పొందింది.
Read Also: Sheikh Hasina: అగ్ర రాజ్యం కుట్రకు హసీనా బలైందా? బలపరుస్తున్న కొత్త అనుమానాలివే!
బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్
కొత్త చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ టోన్-ఆన్-టోన్ ఎంబోస్డ్ డీకాల్స్.. క్విల్టెడ్ సీట్ల రూపంలో ప్రత్యేక మార్పులను చేసింది. ఈ స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్ పెయింట్ స్కీమ్, బలమైన స్టీల్ బాడీని కలిగి ఉంటుంది. మోడల్ నీటి నిరోధకత కోసం IP 67 రేట్ చేయబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 136 కి.మీ ప్రయాణించవచ్చు. ఇది అరై (ARAI సర్టిఫైడ్) ద్రువీకరించిన పరిధి. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 73 కి.మీ ప్రయాణిస్తుంది.
ఫీచర్లు
ఈ స్కూటర్ ఫీచర్ విషయానికొస్తే.. యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్.. ఆటో హజార్డ్ లైట్లతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్ ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.