రియల్ మీ తన C-సిరీస్ యొక్క కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేసింది. కంపెనీ (Realme C75) అనే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 90Hz స్క్రీన్, MediaTek Helio G92 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
హ్యుందాయ్ వెర్నా రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఈ కారు వెనుక స్పాయిలర్‌తో వస్తుంది. అంతేకాకుండా.. కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే.. హ్యుందాయ్ వెర్నా భారతీయ కస్టమర్ల కోసం మొత్తం 8 మోనోటోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని విడుదల చేసింది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పేరుతో విడుదలైంది. ఈ స్పెషల్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలు రెండు ఎంపికలలో లభిస్తాయి. స్టాండర్డ్ ప్యాక్ ధర ప్రస్తుత మోడల్ కంటే INR 24,000. ఆప్షనల్ ప్యాక్ ధర INR 51,700.
వన్ ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. వన్ ప్లస్ 13 అనేది కంపెనీ తాజా ఫోన్.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. ఈ ఫోన్ 24GB RAM+1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వన్ ప్లస్ యొక్క ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.82 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది.
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటే.. ట్రయంఫ్ కంపెనీ మాత్రం రూ. 19.39 లక్షల ఖరీదైన '2025 టైగర్ 1200' బైక్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్ నాలుగు వేరియంట్లలో ముందుకొచ్చింది. అంతేకాకుండా.. కొత్త ఇంజిన్, మెరుగైన రైడ్ సౌకర్యం, ఎర్గోనామిక్స్, మరిన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైకులకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు.. ఇండియాలో ఈ బైక్ లే దర్శనమిస్తాయి. అయితే.. మీరు కూడా భవిష్యత్తులో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగ పడుతుంది. కంపెనీ తన మోస్ట్-వెయిటింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650ని మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే.. గ్లోబల్ డెబ్యూకి ముందు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్ అయ్యాయి.
శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్‌లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇండియాలో ఎలిస్టా (Elista) గూగుల్ టీవీ(Google TV)ని ప్రారంభించింది. తాజాగా.. 85 అంగుళాల(inches) సైజు టీవీని విడుదల చేసింది. ఇంతకు ముందు.. 32 నుండి 65 అంగుళాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 85 ఇంచెస్ టీవీ ధర రూ.1.60 లక్షలు. గూగుల్ టీవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. లేస్ బెజెల్ డిజైన్ వస్తుంది.