మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బాలెనో మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్‌లో బాలెనో సాధారణ మోడల్‌కు భిన్నంగా ఉండే అప్‌డేట్‌లు ఉన్నాయి.
రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ఇచ్చారు. ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
TVS మోటార్ కంపెనీ కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరకు లభించనుంది. TVS రేడియంట్ ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది.
Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6300 చిప్‌సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుంది. అంతేకాకుండా.. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 3 మోడళ్ల స్కూటర్లను 50% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అందులో.. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
ఇండియాలో లావా అగ్ని-సిరీస్ తాజా 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లే, 256GB వరకు స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 3 5G 8GB ఇంబిల్ట్ RAM.. 8GB వర్చువల్ RAMతో 16 GB వరకు మొత్తం RAM సపోర్ట్ చేస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
2022లో ప్రారంభించిన EV6 క్రాస్‌ఓవర్ తర్వాత కియా ఇండియా.. ఆల్-ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. EV9 ఆల్-ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ AWD వేరియంట్‌లో అందిస్తున్నారు. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్).
మరొక హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ (Zelio eBikes Mystery) ఎలక్ట్రిక్ టూ వీలర్ భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను రూ.81,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.మ
యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే.. ఇది మీ కోసమే. 5 గొప్ప కంపెనీలకు సంబంధించిన రూ.15 వేల రేంజ్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అందులో.. సాంసంగ్, ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు డాల్బీ ఆడియోతో క్లారిటీ స్క్రీన్ను పొందుతారు.