రియల్ మీ తన C-సిరీస్ యొక్క కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేసింది. కంపెనీ (Realme C75) అనే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 90Hz స్క్రీన్, MediaTek Helio G92 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో అతిపెద్ద ఫీచర్ 6000mAh బ్యాటరీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
Read Also: Prevent Heart Attack: వేకువజాము గుండెపోటుకు బాపట్ల ప్రొఫెసర్ చెక్.. పేటెంట్ ఇచ్చిన కేంద్రం..
స్పెసిఫికేషన్స్:
రియల్ మీ C75 స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల (2400 x 1080 పిక్సెల్‌లు) ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ని కలిగి ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 180 Hz. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ 690 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో octa-core MediaTek Helio G92 Max 12nm ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా.. ARM Mali-G52 2EEMC2 GPU కూడా ఉంది. ఈ ఫోన్ 128 GB స్టోరేజ్/ 256 GB స్టోరేజ్, 8 GB RAMతో 512 GB స్టోరేజ్ ఎంపికను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ డ్యూయల్ సిమ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ UI 5.0తో వస్తుంది. ఈ ఆండ్రాయిడ్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, సెకండరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌కి శక్తినివ్వడానికి 45W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 6000mAh బ్యాటరీ అందిస్తున్నారు. ఈ ఫోన్ సైజ్ 165.69 x 76.22 x 7.99 మిమీ, బరువు 196 గ్రాములు. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 4G వోల్ట్, వైఫై 802.11 ac, బ్లూటూత్ 5.1, జీపీఎస్, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also: Delhi Capitals: రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఇతనే కెప్టెన్..!
ధర:
ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్, బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 5,690,000 వియత్నామీస్ డాంగ్‌లు (ఇండియాలో సుమారు రూ. 18,900). ఈ ఫోన్ ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. డిసెంబర్ 1 నుండి వియత్నాంలో ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది.