రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైకులకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు.. ఇండియాలో ఈ బైక్ లే దర్శనమిస్తాయి. అయితే.. మీరు కూడా భవిష్యత్తులో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగ పడుతుంది. కంపెనీ తన మోస్ట్-వెయిటింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650ని మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే.. గ్లోబల్ డెబ్యూకి ముందు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్ అయ్యాయి. ఓ వార్త కథనం ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650లో వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, స్లిక్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్ పీస్ సీట్, మినిమలిస్టిక్ బాడీ ప్యానెల్ ఉంటాయి. రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 EICMA 2024లో విడుదల కావచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
Naga Chaitanya: లిఫ్టులో చైతూ-శోభిత.. అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారో!
శక్తివంతమైన ఇంజన్..
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650లో టూ-ఇన్-వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. అంతేకాకుండా.. కాంట్రాస్ట్ బాడీ గ్రాఫిక్స్ తో వస్తుంది. మరోవైపు.. పవర్‌ట్రెయిన్‌గా ఇంటర్‌సెప్టర్ బేర్ 650కి 648cc ట్విన్-సిలిండర్ ఇంజన్ అందిస్తున్నారు. ఇది గరిష్టంగా 47bhp శక్తిని, 52 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో సెట్ చేశారు.
బైక్ ధర..
ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీని అందించే ఫ్లోటింగ్ సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. అంతేకాకుండా.. సస్పెన్షన్ సెటప్‌లో తలక్రిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ మెరుగైన భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABSతో అమర్చబడిన ముందు, వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3.2 లక్షలు ఉంటుంది.