Vivo Y18t: Y-సిరీస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర రూ. 9,499
- ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల
- Vivo Y18t కొత్త ఫోన్ లాంచ్
- డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా
- 4GB RAM.. 128GB ఇంబిల్ట్ స్టోరేజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. Vivo Y18t స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…
ధర:
Vivo Y18T 4 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో 9,499 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ప్రస్తుతం వివో ఇండియా యొక్క ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
Read Also: APPSC: అలర్ట్: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష మళ్లీ వాయిదా
స్పెసిఫికేషన్స్:
Vivo Y18T స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS 14తో వస్తుంది. అలాగే.. 6.56 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ (720×1,612 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90 Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్ పిక్సెల్ సాంద్రత 269 ppi. స్క్రీన్ గరిష్ట ప్రకాశాన్ని 840 నిట్‌ల వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఫోన్‌లో Unisoc T612 చిప్‌సెట్ ఉంది. RAM 4GB. RAMని వర్చువల్‌గా 8 GB వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించుకునే అవకాశం ఉంది.
Vivo Y18t ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే.. 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ 62.53 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ సైజ్ 163×75.58×8.3mm. బరువు 185 గ్రాములు.
కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ బ్లూటూత్ 5.2, FM రేడియో, GPS, GLONASS, Wi-Fi, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, మోటార్ గైరోస్కోప్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి ఇందులో ఉన్నాయి. భద్రత కోసం ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్, IP54 రేటింగ్‌తో వస్తుంది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి