ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది.. మొత్తంగా ఈ ఏడాదిలో పీఆర్సీ ప్రకటన అనేది వట్టి మాటే అని తేలిపోయింది అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ మళ్లీ తిరోగమనం వైపు మళ్లిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్తాం అంటున్నారు.. పీఆర్సీపై కసరత్తులో భాగంగా.. ఇవాళ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఆర్ధిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.. సచివాలయ ఉద్యోగుల సంఘం…
పీఆర్సీ ప్రకటనపై ఓవైపు ఉద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతూనే ఉంది.. ఇవాళ పీఆర్సీ పై మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పీఆర్సీపై చర్చ జరిగిందని…
ఏపీలో అధికారులు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పీటముడి వీడడం లేదు. కాసేపట్లో ప్రారంభం కానుంది పీఆర్సీ పై కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు ప్రభుత్వ సలహాదారు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు శశిభూషణ్, రావత్. అనంతరం సీఎంతో భేటీ కానుంది అధికారుల బృందం. ఐఆర్ 27 శాతం ఇస్తున్న నేపథ్యంలో దీని కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదనపు…
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు,…
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు. పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా…
గత కొన్ని రోజలు నుంచి ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం పీఆర్‌పీ స్పష్టత ఇవ్వాలంటూ.. అంతేకాకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యం నిన్న సీఎస్ సమీర్‌శర్మ సీఎం జగన్‌కు పీఆర్‌ఎస్‌పై నివేదికను అందించారు. అంతేకాకుండా 72గంటల్లో జగన్ తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది… అసలు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మనసులో ఏముంది? ఫిట్‌మెంట్ 30 శాతం మార్క్ అయినా దాటుతుందా…? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు.. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, 11వ వేతన సంఘం ఇప్పటికే 23 శాతం సిఫార్సు చేసింది.. ఇక, కేంద్రం ఇస్తున్నట్లు 14 శాతం సిఫార్సు చేసింది సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. కానీ, కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ అయినా వస్తుందని ఆశలు…
పీఆర్సీ పై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని.. ముఖ్యమంత్రి జగన్ తమ డిమాండ్లు పరిష్కారం చేస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు. ప్రభుత్వం నుంచి మా డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేకపోవడం నిరసన కార్యాచరణ ప్రారంభించామని.. సీఎస్ నేతృత్వంలో పీఆర్సీ పై నివేదిక వెల్లడించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్య ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కావాల్సిందేనని.. 1-07-2018 నుంచి ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉండగా… నివేదికలో ఈ ఏడాది…
పీఆర్సీ పై ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటన చేశారు. పీఆర్సీ నివేదికపై అధ్యయనంపై అధికారుల కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయ్యామని.. తమ సూచనలను సీఎం జగన్ కు నివేదించామని వెల్లడించారు. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలని.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలని.. 2 అంశాలు అమలు చేయనక్కర్లేదని సూచించామని సీఎస్ పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటారన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సచివాలయ…
సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం…