పీఆర్సీ ప్రాసెస్‌లో ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ ప్రకటనపై ఓవైపు ఉద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతూనే ఉంది.. ఇవాళ పీఆర్సీ పై మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పీఆర్సీపై చర్చ జరిగిందని తెలిపారు.. పీఆర్సీ అంశం ప్రాసెస్‌లో ఉందన్న ఆయన.. పీఆర్సీ ఎంత శాతం ఇస్తారు అనే దానితో పాటు ఇతర అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఉన్నంతలో ఎంతో కొంత అధికంగా ఇవ్వాలనే ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని.. కాకపోతే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేదు.. ఇది వాస్తవం అని స్పష్టం చేశారు సజ్జల.
అయితే, రాజకీయ ప్రయోజనాల మాత్రమే చూస్తే వెంటనే పీఆర్సీ పై నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి… పీఆర్సీతో పాటు డీఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. అన్ని అంశాలు చూడాల్సి ఉందన్నారు.. మొత్తం బరువు మీద పడకుండా చూసుకోవాలని.. ఆర్ధిక పరిస్థితి బాలన్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కానీ, కావాలని పీఆర్సీ ఆలస్యం చేయడం లేదని.. ఆర్ధికశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని.. రేపటి నుంచి అధికారులు ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చలు జరుపుతారని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!