పీఆర్సీ పై ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటన చేశారు. పీఆర్సీ నివేదికపై అధ్యయనంపై అధికారుల కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయ్యామని.. తమ సూచనలను సీఎం జగన్ కు నివేదించామని వెల్లడించారు. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలని.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలని.. 2 అంశాలు అమలు చేయనక్కర్లేదని సూచించామని సీఎస్ పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సచివాలయ ఉద్యోగులకూ పీఆర్సీని అమలు చేయాలని సూచించామని ఆయన తెలిపారు. 27 శాతం ఫిట్ మెంట్ ను కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రతిపాదించిందని… 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా.. పీఆర్సీ, ఫిట్మెెంట్ విషయంలో సీఎస్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదే లేదంటోన్నారు ఉద్యోగ సంఘాలు.