పొలిటికల్ సర్కిల్స్ లో ప్రశాంత్ కిషోర్(పీకే) గురించి తెలియని వారుండరు. రాజకీయ వ్యూహకర్తగా పీకేకు మంచి పేరుంది. ఏ పార్టీకైనా ఆయన వ్యూహాకర్తగా పని చేస్తున్నారంటే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఆయన ఎంట్రీతోనే ఆపార్టీ సగం గెలిచినట్టే భావన కలుగుతుంది. దీంతో పీకేకు దేశంలో ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడింది. ఆయన ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. దీంతో పీకేను పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పెట్టుకునేందుకు ప్రాంతాలకు అతీతంగా ఆయా పార్టీలు ముందుకొస్తున్నాయి.…
ఏపీలో ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. కడప జిల్లా బద్వేల్లో జరుగాల్సిన ఉప ఎన్నిక సైతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఎన్నికకు మరో ఆరునెలల సమయం పట్టొచ్చు. ఇక జగన్ సర్కారు మరో రెండున్నరేళ్లపాటు ఎలాంటి ఢోకా లేకుండా అధికారంలో ఉండనుంది. అయినప్పటికీ ఏపీలో పోలిటికల్ హీట్ మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన…
ప్రస్తుతం దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. పార్లమెంట్‌లో దీనిపై పెద్ద ఎత్తున రగడ జరగడం ఖాయంగా కనిపిస్తున్నది. అన్నింటికి పక్కన పెట్టి ఈ స్పైవేర్‌పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ పలుమార్లు హ్యాకింగ్‌కు గురైనట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చినట్టు పేర్కాన్నారు. అయినప్పటికీ ఫోన్ హ్యాకింగ్‌కు బారిన పడుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం…
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని నివేదికలు రాగా.. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై ఇవాళ పార్లమెంట్‌లోనూ దుమారం రేగింది.. అయితే ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ…
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేషనల్ వైడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా సోనియా గాంధీ కుటుంబంతో మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించినట్లు అంత అనుకున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు..…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తాజాగా.. తాను వ్యూహాలు అందించిన పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన పీకే.. ఆ తర్వాత వరుస భేటీలతో పొలిటికల్ హీట్ పెంచారు.. శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయ నేతను ఆయన కలవడం.. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా..…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనివారుండరు.. ఆయన వ్యూహాలతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. మొన్నటి మొన్న పశ్చిమ బెంగాల్‌లో దీదీ వరకు ఎంతో మంది పీఠాన్ని ఎక్కారు.. నితీష్ కుమార్, వైఎస్ జగన్, స్టాలిన్.. ఇలా చాలా మందికే వ్యూహ రచన చేశారు పీకే.. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా.. తన టీమ్‌ను రంగంలోకి దింపి పనిమొదలు పెడతారు. అయితే, బెంగాల్ ఫలితాల తర్వాత తన వృత్తిని వదిలేస్తున్నట్టు సంచలన…