బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చివరి రాజకీయ ఇన్నింగ్స్‌లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓ జాతీయ మీడియాతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్‌ను తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎప్పటికీ అనుమతించబోదని అన్నారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. కునాల్ కమ్రా తన స్నేహితుడని.. తనకు తెలిసినంతవరకు కునాల్ రాజకీయాలు చేయడన్నారు. అతనికి అలాంటి ఉద్దేశాలు లేవని చెప్పారు. బహుశా కునాల్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా కదనరంగంలోకి దిగాడు. ఇటీవల టీవీకే పార్టీ రెండో ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, విజ
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. మరోసారి బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈసారి కూడా బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీయే కూటమి ఎన్నికల బరిలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుస క్యూ కట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కానున్నారు.
Prashant Kishore: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరాజ్ (జేఎస్‌యూపీఏ) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయనను ఈరోజు (జనవరి 6) తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పట్నాలోని గాంధీ విగ్రహం వద్ద ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది.