ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం…
భారత గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇక, పీకే కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోన్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోనియా-పీకే సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. అయితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.. గుజరాత్ పోల్స్‌పై చర్చించడానికే ఈ భేటీ జరిగిందని.. గుజరాత్‌తో…
గుజరాత్‌పై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టిందా? అక్కడ జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకే ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుందా? అందుకే రాహుల్‌తో రాజకీయ వ్యూహకర్త పీకే భేటీ అయ్యారా? ఇప్పుడంతా ఇదే టాపిక్ అవుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ కోసం రంగంలోకి దిగుతున్నారా? మోదీ ఇలాఖా గుజరాత్‌లో బీజేపీని గద్దె దించి… గాంధీల పార్టీని గెలిపిస్తారా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా?…
కాంగ్రెస్ పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నారా..? రాహుల్ గాంధీతో భేటీ అయ్యారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా సాగుతోంది.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లోనూ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమావేశంలోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఆ…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గురించి తనదైన రీతిలో కేసీఆర్ స్పందించారు. దేశంలో మార్పు కోసం పీకే తో కలసి పని చేస్తున్నాం. పీకే తో మాట్లాడుతున్నాం. నాకు 7 ఎనిమిది ఏళ్లుగా పీకేతో స్నేహం ఉందన్నారు. డబ్బుల కోసం పీకే ఎప్పుడు పని చేయరు. ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం అన్నారు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు…
వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు సోమిరెడ్డి. టీడీపీ నేతలు.. కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తుందని మా అనుమానం. ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని మేం నమ్ముతున్నాం. దీనిపై గతంలోనే మా అనుమానాలు వ్యక్తం చేశాం. పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్.…
సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్…
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకోవడంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గీతారెడ్డి.. మన గ్రాఫ్ పెరుగుతుంది.. సీఎం కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతుందన్న ఆమె.. ట్యూషన్ టీచర్‌ని ఎందుకు పెడతాం..? పిల్లలు వీక్‌గా ఉంటేనే కదా..? అని ప్రశ్నించారు.. అంటే కేసీఆర్ వీక్ అయ్యాడు కాబట్టే.. ట్యూషన్ టీచర్‌ని తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు గీతారెడ్డి.. ఇక, తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు..…
తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రకాంత్ కిషోర్.. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించే పనిలో పడిపోయారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ఇవాళ పరిశీలించారు పీకే.. ఆ తర్వాత మల్లన్నసాగర్ నిర్వాసితులతోనూ మాట్లాడారు.. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తోంది పీకే టీమ్.. గత రెండు రోజులుగా తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన సాగుతోంది.. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంది.…