కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తాజాగా.. తాను వ్యూహాలు అందించిన పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన పీకే.. ఆ తర్వాత వరుస భేటీలతో పొలిటికల్ హీట్ పెంచారు.. శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయ నేతను ఆయన కలవడం.. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా.. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నేతల అఖిలపక్ష భేటీ జరగడం జరిగిపోయాయి.. తాజాగా మళ్లీ దీదీని కలిసిన పీకే.. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఉన్నట్టుండి.. ఇవాళ.. రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్… ఈ సమావేశంలో ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పీకే రంగంలోకి దిగారా..? గతంలో.. నరేంద్ర మోడీకి వ్యూహాలు అందించి.. ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి కృషి చేసిన పీకే.. ఇప్పుడు.. రాహుల్‌కు వ్యూహాలు అందిస్తున్నారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.