రాహుల్, పీకే ఫోన్లు కూడా ట్యాప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని నివేదికలు రాగా.. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై ఇవాళ పార్లమెంట్‌లోనూ దుమారం రేగింది.. అయితే ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి మేనల్లుడు అభిషేక్ బెనర్జీల ఫోన్‌పై కూడా పెగాసస్ నిఘా సాఫ్టేవర్‌తో ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 17 వార్త సంస్థలు పెగాసస్ ప్రాజెక్ట్ పేరుతో చేసిన పరిశోధనాత్మక కథనాలు తరువాతి భాగం ఇవాళ ప్రచురించగా.. ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం నిజమేనని, ఆయన ఫోన్‌ను తాము అమ్నెస్టి ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్ వద్ద ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు కొన్ని జాతీయ స్థాయి వెబ్‌సైట్లు రాశాయి..
ఇక, అభిషేక్ బెనర్జి పర్సనల్ సెక్రటరీ ఫోన్ కూడా హ్యాకింగ్‌కు గురైంది. అయితే వీరి ఫోన్లను ఫోరెన్సిక్ దర్యాప్తు చేయలేదని తెలిపాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థ తన నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం కేంద్ర ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ప్రభుత్వం హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని ఫోరెన్సిక్ పరీక్షలు బయటపడింది. హ్యాక్ అయిన డేటాబేస్‌లో సుమారు 300 మంది భారతీయుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలుస్తుండగా.. అందో 40 మంది జర్నలిస్టులు కూడా ఉన్నట్లు ప్రాథమిక అంచనా..
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు