రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు గురించి చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.. జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చ సాగగా.. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై మంతనాలు సాగాయంటున్నారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోగా.. ఈ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన దీదీ.. ఇప్పుడు అదే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.. దానికోసం ప్రశాంత్ కిశోర్ సారథ్యంలో బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం అవుతాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
also read పెరిగిన మదర్ డెయిరీ పాల ధర.. రేపటి నుంచే అమల్లోకి..
ఇక, ఇప్పటికే సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా రెండు దపాలుగా సమావేశమైన పీకే.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారంటూ వార్తలు వచ్చాయి.. పవార్‌తో పాటు ఈ ఏడాది మార్చిలో టిఎంసిలో చేరిన మాజీ బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాతో చర్చలు జరిపారు.. అనంతరంగా.. ఢిల్లీ వేదికగా.. కాంగ్రెస్, బీజేపీయేతర నేతలతో సమావేశం కూడా నిర్వహించారు.. ఈ భేటీకి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, రాష్ట్రీయ లోక్ దళ్ జయంత్ చౌదరి, ఎన్‌సిపి ప్రఫుల్ పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ సుశీల్ గుప్తా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బినోయ్ విశ్వం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నిలోత్పాల్ బసు పాల్గొన్నారు. ఇంధన ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి పలు అంశాలపై చర్చించారు.