ఆ యువతికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరకు ఇరుకుటుంబాల్లో వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రేమికులది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంగా గుర్తించారు.…
CM Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (మార్చ్ 8న) మార్కాపురం వెళ్లనున్నారు. ఇక, 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11.15 గంటల వరకు అధికారులతో భేటీ కానున్నారు.
మానవత్వం అనేది మనుషులకు లేకుండా పోతుంది.. అభం, శుభం తెలియని పసికందులను కూడా రోడ్డు పాలుచేస్తున్నారు.. చేసిన పాపాలను వదిలించుకోవాలని దారుణాలకు ఒడిగడుతున్నారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అమానుష ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును గోనెసంచిలో పెట్టి తాసిల్దార్ కార్యాలయం దగ్గర వదిలేసి వెళ్లారు.. ఆ బిడ్డ మగ బిడ్డ. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు దగ్గర గోనే సంచిలో మగ శిశువు దొరికింది. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా…
Yerragondapalem: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాల ఘర్షణకు దిగాయి.. దీంతో మహిళలు సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి ముందు కాలనీ పేరిట ఆర్చి నిర్మానానికి ఏర్పాట్లు చేయటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణాన్ని మరో వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు.. రాళ్ళ దాడిలో కానిస్టేబుల్ కి తీవ్రగాయలు కావటంతో హాస్పిటల్ కి…
ఆదిమూలపు సురేష్. ఏపీ మంత్రివర్గంలో రెండోసారి చోటు దక్కించుకున్న ఆయన ప్రస్తుతం మునిసిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే వైసీపీ కార్యకర్తలు మంత్రికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆయన తొలిసారి మంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? రాబిన్‌శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..! గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్…
ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఓ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. తల్లీ కూతుళ్ల హత్యను నరహంతక ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇంట్లో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. హత్య ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలతో పాటు బూటు గుర్తులతో నేరస్తుల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పోలీసులు…