మానవత్వం అనేది మనుషులకు లేకుండా పోతుంది.. అభం, శుభం తెలియని పసికందులను కూడా రోడ్డు పాలుచేస్తున్నారు.. చేసిన పాపాలను వదిలించుకోవాలని దారుణాలకు ఒడిగడుతున్నారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అమానుష ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును గోనెసంచిలో పెట్టి తాసిల్దార్ కార్యాలయం దగ్గర వదిలేసి వెళ్లారు..
ఆ బిడ్డ మగ బిడ్డ. తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు దగ్గర గోనే సంచిలో మగ శిశువు దొరికింది. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా గిద్దలూరు లో చర్చనీయాంశంగా మారింది. శిశువును ఉంచిన గోనెసంచిని పందులు లాక్కెళ్తుండగా.. శిశువు ఏడవడంతో కార్యాలయంలోని సిబ్బందికి వినిపించాయి.. వెంటనే అలెర్ట్ వారు బయటికి వెళ్లి పందులను తరిమికొట్టి.. గోనెసంచిలోని నవజాత శిశువును స్వాధీనం చేసుకున్నారు..నవజాత శిశువును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు..
శిశువు పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ధ్రువీకరించారు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాబు తల్లి దండ్రులను వెతికే పనిలో ఉన్నారు.. ఇక ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం ఒడిశాలో వెలుగు చూసింది. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి నవజాత కుమార్తెకు విషపూరిత ఇంజక్షన్‌ను ఎక్కించిన ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో వెలుగు చూసింది..