ఆ యువతికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరకు ఇరుకుటుంబాల్లో వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రేమికులది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంగా గుర్తించారు.
Also Read:Toli Ekadasi 2025: నేడు తొలి ఏకాదశి.. ముహూర్తం, పూజా విధానం ఇవే!
మృతులు బూరుగుల కంబగిరి రాముడు(24), నల్లబోతుల భారతి (20). కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో కొండలలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లబోతుల భారతికి రెండేళ్ల క్రితం తన మేనమామ కుమారుడు శివప్రసాద్ తో వివాహం జరిగింది. కొంతకాలం క్రితం తన భర్తను విడిచిపెట్టి వచ్చి మాధవరంలో భారతి ఉంటుంది. కాగా బూర్గుల కంబగిరి రాముడు, నల్లబోతుల భారతి ఇద్దరు వరుసకు అన్నాచెల్లెళ్ళు అవుతారు. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. నిన్న సాయంత్రం తన తండ్రికి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి తన తండ్రి సెల్ కి లొకేషన్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కంబగిరి రాముడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.