కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. బెట్టింగ్ రాజాలు కూడా అదే పంథాను ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు కోళ్లపై, గుర్రాలపై పందేలు కాసేవాళ్లు. ఆ తర్వాత రాజకీయాలు, క్రికెట్ వంటి క్రేజీ అంశాలపై బెట్టింగులు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ట్రెండ్ మారుతున్న కొద్ది బెట్టింగ్ రాజాలు సైతం అప్ డేట్ అవుతున్నారు. మీడియాలో ఏ అంశంపై ప్రజలు విపరీతంగా చర్చిస్తూ ఉంటారో అలాంటి అంశాలనే పందెంరాయుళ్లు దృష్టిసారిస్తున్నారు. వాటిపైనే లక్షల్లో పందేలు కాస్తూ జేబులు…
మా ఎన్నికలు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తాజాగా మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు.. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవన్నారు.. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని సూచించిన ఆయన.. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు,…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రధాన పోటీదారులు. ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉందని నాగబాబు స్వయంగా ప్రకటించగా, మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి హీరోలతో పాటు లోకల్ అనే నినాదానికి కట్టుబడి ఉన్న మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ చెలరేగింది. ఇక మరో రెండ్రోజుల్లో ‘మా’…
ఈసారి ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్టోబర్ 10న ‘మా’ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. టాప్ సెలెబ్రిటీలు, సీనియర్ హీరోహీరోయిన్లు సైతం మీడియా ముందుకు వచ్చి తమ సపోర్ట్ ఎవరికీ అనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడుస్తోంది. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమ తెలిపింది. అయితే, తాజాగా హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి…
‘మా’ ఎన్నికల వివాదం ఈసారి నటి హేమ, కరాటే కల్యాణి వంతు వచ్చింది. ఇప్పటివరకు సైలెంట్ గా వీరిద్దరూ మరో చర్చకు తెరలేపారు. తాజాగా నటి హేమ తనను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.. నాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. నన్ను నరేష్, కరాటే కల్యాణి బెదిరిస్తున్నారు. నరేష్, కరాటే కల్యాణి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని’ హేమ తెలిపింది. ఈమేరకు హేమ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపించడం సరికాదని నాగబాబు అన్నారు. ఒక్కో ఓటరకు రూ. 10 వేలు ఇస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ డబ్బిస్తామని ఆశ చూపుతున్నారు. ప్రకాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉండాలి. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా ఎన్నికైతేనే మా బాగుపడుతుందన్నారు. కొందరు మంచు విష్ణు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు?…
‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు…
ఈ ఆదివారం మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కౌంటర్లు, సెటైర్లతో ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈసారి మా ఎన్నికలు మెగా వర్సెస్ మంచు అనేలా మారిపోయాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంచు విష్ణు తాజాగా ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రకాష్ రాజ్ మంచు విష్ణు దొంగతనంగా ఓటు వేయించుకున్నాడు అని,…