ఈరోజు ఉదయం నుంచి మా ఎన్నికలు ప్రారంభం కాగా నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు ఒకరి పై ఒకరు విరుచుకు పడుతున్నారు. ఈ వాగివివాదం నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగింది. దాదాపుగా ప్రకాష్ రాజ్ నరేష్ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కొట్టుకోవడానికి తయారయ్యారు.
Read Also : “మా” ఎలక్షన్స్ : శివబాలాజీ చెయ్యి కొరికిన హేమ
ఇంతకు ముందు వరకు సైలెంట్ గానే ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు బహిరంగంగానే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇదంతా చూసిన వాళ్లు మా ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సంబంధించి రిగ్గింగ్ కు పాల్పడుతున్నాడు అనేది మంచు విష్ణు వర్గం ఆరోపణలు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన తర్వాత ఈ వాగ్వాదం నెలకొంది. వారిద్దరికీ నచ్చజెప్పి పోలింగ్ అధికారులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.