మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడుస్తోంది. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమ తెలిపింది.
అయితే, తాజాగా హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ హేమ ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన తనకు అవసరం లేదన్నారు కరాటే కళ్యాణి.. అవసరమైతే తమ దగ్గర వున్నా సాక్ష్యాలను బయటపెడుతామన్నారు. నీ ఓటు గూర్చి నువ్వు అడగటం మానేసి.. కళ్యాణ్ ని ఓడించండి అంటూ క్యాంపెన్ చేయడంలోనే నువ్వు ఎంత వీకో అర్ధమవుతోంది. ఆఫీసియల్ వాట్సాప్ గ్రూప్ లో ఏ ఏ ఫోటోలు పంపి.. డిలీట్ చేస్తోన్నావో అందరు చూస్తున్నారు.. ఎక్కువ మాట్లాడితే, మా దగ్గర చాలా వున్నాయి.. అవి అన్ని బయటకు తీయాల్సి వస్తోంది’ అంటూ కరాటే కళ్యాణి హెచ్చరించింది.