క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రణరంగాన్ని తలపించిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇంతకు మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి చాలామంది ‘మా’ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ‘మా’ సభ్యులు 925 మంది ఉండగా, రికార్డు స్థాయిలో అంటే పోస్టల్ బ్యాలెట్ తో కలిఫై మొత్తం 665 మంది సభ్యులు ఓటు వేశారు. దాదాపు 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 83 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గతంతో పోలిస్తే భారీగా ఓటింగ్ నమోదైందని చెప్పాలి. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. సీనియర్ నటులు మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో ఈ కౌంటింగ్ జరుగుతుంది.
Read also : ముగిసిన ‘మా’ పోలింగ్.. కొత్త రికార్డు..
ఇదిలా ఉండగా కొందరు సినీ ప్రముఖులు ‘మా’ సభ్యులుగా ఉన్నప్పటికీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోలేదు. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, గోపీచంద్, రానా, నాగ చైతన్య, అల్లు శిరీష్, నితిన్, సుమంత్, నాగ శౌర్య, సునీల్ తదితరులు ఉన్నారు. ఇక హీరోయిన్ విషయానికొస్తే… రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, సమంత, అనుష్క తదితరులు ఓటు వేయలేదు. అయినప్పటికీ పోలింగ్ విషయంలో ఈసారి ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించడం విశేషం.