మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.. చాలా కాలం నుంచి అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఆయనకు జంటగా…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఎన్నికల రేస్ లో ఉన్నారు. అయితే ప్రకాష్ ప్యానల్ ఎన్నికల క్యాంపెన్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విందు సమావేశాలు అంటూ ప్రకాష్ రాజ్ మీటింగ్ పెట్టగా.. మరోసారి మెంబర్స్ తో ‘మా ఎన్నికల’ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్ లో ఏ…
సౌత్ సీనియర్ నటుడు ఓ పేద కుటుంబం జీవితం మెరుగుపడడానికి తన వంతు సాయం చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలోని ఒక కుటుంబానికి తాను జేసీబీని బహుమతిగా ఇచ్చానని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన వారికి జేసీబీని అందజేసిన పోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ” ప్రకాష్ రాజ్‌ఫౌండేషన్ చొరవతో శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలో ఒక కుటుంబానికి జేసీబీతో సాధికారత కల్పించాం… వారి జీవితంలోకి…
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్‌కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్…
అక్టోబర్ 10న “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత, హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత, హేమతో చర్చలు జరిపి…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివాదాలు కూడా ఎక్కువే అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ విందు రాజకీయంపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు కావాలంటే ఫోన్ చేసి.. మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో మీటింగులు పెట్టి.. ఒక చోట చేర్చి ప్రాణాలతో చెలగాటమడోద్దని అని బండ్ల గణేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీతోనే…
గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వివాదం విషయమై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించారు. అయితే ఆయన ప్యానల్ లో అంతకు ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్…
చిరంజీవి సోమవారం గోపీచంద్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ చూసి, దర్శకుడు సంపత్ నందితో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, యంగ్ హీరో ఆది పినిశెట్టి ‘క్లాప్’ మూవీ టీజర్ ను సైతం చిరంజీవి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘క్లాప్’ విజయం కావాలని…