కరోనా మూడోవేవ్ మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. పరిస్థితులు అన్ని చోట్లా చక్కబడుతుండటంతో సాధారణ వాతావరణం నెలకొననుంది. దీంతో వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ వరుసగా విడుదలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించగా ఈ రోజు ‘రాధే శ్యామ్’ను కూడా మార్చి 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే డిసి కామిక్ సూపర్ హీరో ‘బ్యాట్ మేన్’ సినిమను మార్చి 4న యుఎస్…
ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసింది సినిమా యూనిట్. వాస్తవానికి అనేక సార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా గతంలో ప్రకటించారు. కానీ కరోనా మూడవ దశలో భారీగా కేసులు నమోదవుతున్న కారణంగా మిగతా పెద్ద సినిమాల లాగానే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. కరోనా సమయంలో కూడా అమ్మడి షెడ్యూల్ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయ ఢంకా మొదలుపెట్టిన బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్ తో విజయాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా తో ఆ రెండు సినిమాలు వాయిదా పడడంతో అమ్మడికి బ్రేక్ పడింది. ఇక ఇటు పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను…
త్వరలో థియేటర్లలోకి రాబోతున్న పెద్ద సినిమాలకు సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. వాటిలో చాలా వరకు అవాస్తవమే అయినా కూడా అభిమానులను మాత్రం ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం మొత్తం ‘రాధేశ్యామ్’ ఓటిటిలో విడుదలవుతుందని వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందని, 500 కోట్ల భారీ డీల్ కుదిరిందని నిన్న ఉదయం నుంచి గాసిప్లు వినిపిస్తున్నాయి. Read Also : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు దిల్ రాజు క్రేజీ…
దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘బీస్ట్’ మూవీపై బాలీవుడ్ నిర్మాతల కన్నుపడింది. అయితే ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని ఫ్యాన్స్ ఆఫర్ తో సొంతం చేసుకోవాలనుకుంటున్నాడట. పోటీపడుతున్న వారిలో ఇప్పుడు సాజిద్ దే పైచేయిగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురము”లో సినిమా విడుదలై నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే తెర వెనుక జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అవుతోంది. పూజా తన ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్హతో ఉన్న ఒక అందమైన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె, అల్లు అర్జున్ లిటిల్ ప్రిన్సెస్ అల్లు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. అన్ని బావుంటే ఈపాటికే రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలైపోయేయి. కానీ, కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమపై మరోసారి దెబ్బ వేసింది. దీంతో ఈ సంక్రాంతి రేసు నుంచి రాధేశ్యామ్ తప్పుకొంది. మరో మంచి రోజు చూసి ఈ సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే ఫ్యాన్స్ ని నిరాశపడకుండా డైరెక్టర్ రాధా నిత్యం ఏదో ఒక…
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్న విషయం విదితమే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తుండగా, మేకర్స్ మాత్రం సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని ఇప్పటి వరకూ చెప్తూ వచ్చారు. అయితే ఒకవైపు రోజురోజుకూ ఆందోళకరంగా మారుతున్న పరిస్థితులు, మరోవైపు రూమర్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా విడుదల గురించి ఇప్పటిదాకా కన్ఫ్యూజన్…
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల గురించి చాలా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సినిమా వాయిదా తప్పదు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రూమర్స్ కు సమాధానంగా అనుకున్న ప్రకారం జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారిక ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు మరోమారు కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి…
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబోలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తరువాత హైట్రిక్ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఈ సినిమాలో మహేష్ సరసన సమంత ఛాన్స్ కొట్టేసింది అంటుండగా.. మరికొంతమంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే…