యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. అయితే ఇప్పుడు చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేయడానికి సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఈ చిత్రం కోసం క్రిస్ప్ రన్ టైమ్‌ను లాక్ చేసారు. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉందని సమాచారం. రాధేశ్యామ్’ వంటి భారీ బడ్జెట్ లవ్ డ్రామాకు ఇలాంటి క్రిస్ప్ రన్‌టైమ్‌ను లాక్ చేయడం ఆసక్తికరంగా ఉంది.
Read Also : స్టార్లకు అనసూయ కలిసొస్తుందా..?
కానీ హిందీ వెర్షన్ ను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక హిందీ వెర్షన్ లో తెలుగుకు భిన్నమైన సౌండ్‌ట్రాక్ కూడా ఉంటుంది. మేకర్స్ త్వరలోసినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టే అవకాశం ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భాయ్ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించనున్నాడు.