హనుమకొండ జిల్లా హయగ్రీవ గ్రౌండ్‌లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరంగల్‌కి 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది ప్రభుత్వం.
Numaish 2025 : ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే నుమాయిష్ ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) – 2025ను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ విహెచ్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా…
Ponnam Prabhakar : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. గురువారం, సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా…
Sewerage Overflow Free City : హైదరాబాద్ నగరంలో సీవరేజీ సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ నేటితో విజయవంతంగా ముగిసింది. గాంధీ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 90 రోజులుగా నిర్విరామంగా సాగిన ఈ డ్రైవ్ ద్వారా నగరంలోని 17,050 ప్రాంతాల్లో 2,200 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లను శుభ్రం చేశారు. ఈ చర్యల…
రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి…
Ponnam Prabhakar : సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్ (జూబ్లీ బస్ స్టాండ్) లో ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ స్టేషన్‌లో టాయిలెట్స్ పరిశీలించారు.. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్ లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని సూచించారు.. క్యాంటీన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు.. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. Jbs లో ఉన్న…
గత 25 రోజులుగా సర్వ శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ అధికారులు చర్చలు నిర్వహించారు.
Ponnam Prabhakar : భారత రత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నివాళులు అర్పించారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న క్యాలండర్ ను ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంప్ ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..…
KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్నటి మీడియా సమావేశం అవినీతి జరుగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారన్నారు.
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండని ఆయన విమర్శించారు. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే, ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం తప్పని…