Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…
Orthopedic Walkathon: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద మూనట్ (Moonot) వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్‌థాన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ వాక్‌థాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో ఎముకలు, కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు. 3 కి.మీ, 5 కి.మీ, 7 కి.మీ వాక్‌థాన్ నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకూ కొనసాగింది. ఇందులో వివిధ వయసుల…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పారదర్శకంగా, శాస్త్రీయంగా కుల గణన సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వే పూర్తిగా సమగ్రంగా, జాతీయ ప్రామాణికాలతో నిర్వహించబడుతోందని, అందుకు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించారని తెలిపారు. మొత్తం…
Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం…
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సర్వేను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిర్వహించిందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. అయితే, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కావాలని సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో…
కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
Ponnam Prabhakar: ఎవరు.. ఎంతో వారికి అంత అని రాహుల్ గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగా కుల గణన సర్వే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు.. బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ ఒక్కటే అని, సర్వే లో పాల్గొనని వాళ్ళు… ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వే కి వెళ్ళిన వాళ్లకు రెస్పాండ్ కాకుండా… ఇప్పుడు సర్వే రాలేదు అంటున్నారని, ప్రధాన రాజకీయ…
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీపై అవగాహన చాలా అవసరం.. ఈ అవగాహన వల్ల మనం అందరం ఒక్కొక్కరం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషం అన్నారు. జనవరి ఒకటిన ప్రారంభించాం.. గతంలో వారోత్సవాలను మాసోత్సవాలు చేశారు.. బ్లాక్ స్పాట్స్ ఉన్న వాటిని గుర్తించి వాటిని పూడ్చే ప్రయత్నం మొదలైంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని హైదారాబాద్ ఇన్చార్జి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమే అని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో గత పది ఏళ్లలో లేని అభివృద్ది ఇప్పుడు జరుగుతుంటే ఈర్శగా ఉందా? అని మంత్రి పొన్నం విమర్శించారు. జీహెచ్ఎంసీ…
మామునూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీఎం దిగ్భ్రాంతి వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ.. రెండు ఆటోలను ఢీ కొట్టింది. దీంతో.. భారీ ఐరన్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు…