KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్నటి మీడియా సమావేశంలో అవినీతి జరుగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రోజీసర్ కరెక్ట్ గా లేదని అన్నారు.. అంతేకాని అవినీతి లేదని అన్నారు. వీళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రిని కూడా ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పడం జరిగిందన్నారు. నేనేం భయపడటం లేదన్నారు. అయిన మేము అలానే ముందుకు పోతాం అంటే పోనీ మేము కూడా లీగల్ గా ముందుకు వెళతామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాలన్నారు.
Read also: Jamili Election Bill: జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జమిలి ఎన్నికల బిల్లు..
క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మోబిలైజేషన్ అని ఉండేది. దానికి హరీష్ రావు చైర్మన్ ఉండేదని తెలిపారు. ఓఆర్ఆర్ పై టిఓటి విధానంపై మేము 7400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగిందని కేటీఆర్ అన్నారు. మేము టిఓటిని పారదర్శకంగా చేయడం జరిగిందన్నారు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారన్నారు. అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగింది అని అన్నారు కదా…..మరి ఆ పర్మిషన్ రద్దు చేయాలి గా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓఆర్ఆర్ పై సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. సిట్ అంటేనే ఆయన కోసం పని చేసే అధికారులు ఉంటారని, ప్రమోషన్ కోసం పని చేయాల్సిన వారు ఉన్నారన్నారు.
Read also: AP Rains: తీవ్ర అల్పపీడనం ప్రభావం.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
నేషనల్ హైవే వాళ్ళు పెట్టిన టిఓటి ప్రకారమే వెళ్ళాం తప్ప ఇంకోటి లేదన్నారు. పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పాడు అవినీతి జరుగలేదన్నారు. కేస్ ఎవరికి అప్పగించాలో కూడా వారికి తెలియదన్నారు. రూ.50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి ఏసీబీ కిందికి వస్తుందని చురకలంటించారు. నిన్న హరీష్ రావు అప్పులపై అద్భుతంగా సభలో ప్రసంగించారన్నారు. దాన్ని వారు తట్టుకోలేదు. అప్పులు చేశారని నిరూపించడంతో కావాలని నిన్న కేస్ నమోదు చేశారన్నారు. అంతేకాదు సిట్ కూడా అందుకే వేశారన్నారు. మంత్రులకు శిక్షణ తరగతులు పెట్టాలి.. ఎమ్మెల్యేలకు పెట్టారు అందుకే చెప్పులు లేపారని, ఇదా వీరు ఇచ్చిన శిక్షణ అని కేటీఆర్ అన్నారు.
Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..