Ponnam Prabhakar : అమీర్ పేట్ CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు, రోగులు, రోగుల బంధువులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాస్పిటల్‌కి ప్రతిరోజూ వస్తున్న ఓపీలు ఎన్ని, ఎమర్జెన్సీ కేసులు ఎన్ని, ప్రతి నెలలో జరుగుతున్న గర్భిణీ ప్రసూతులు ఎన్ని తదితర వాటిపై హాస్పిటల్ సూపరిండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. గైనకాలాజీ విభాగాన్ని పరిశీలించారు.. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు విశ్వాసం కల్పించేలా పని చేయాలని వైద్యులకు సూచించారు మంత్రి.. చిన్న పిల్లలకు మందులు ఇచ్చే గది ఫార్మా రూం, ల్యాబ్ లను పరిశీలించారు మంత్రి పొన్నం. మెడికల్ ఓపీ పరిశీలించి.. స్వయంగా బీపీ చెకప్ చేసుకున్నారు. ఏమైనా మందుల కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు.. ఏ ఏ మందులు ఎక్కువగా వెళ్తుంటాయి అడగగా బీపీ ,షుగర్ ,ఫీవర్ , జలుబు ఎక్కువగా ప్రతి నెల వినియోగంలో ఉంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బయో మెడికల్ వెస్టేజ్ ప్రాంతాన్ని పరిశీలించారని, హాస్పిటల్‌లో పని చేసే శానిటేషన్ సిబ్బందికి కొద్ది నెలలుగా జీతాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే వైద్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, హాస్పిటల్ సూపరిండెంట్ మహమ్మద్ రావుఫ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
UI Movie : “యూఐ” మూవీకి సంబంధించిన ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన యూనిట్
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రి సందర్శించడం జరిగిందని, ఇక్కడ ఉన్న పరిస్థితులు డాక్టర్లు, ఎమర్జెన్సీ, గైనిక్, మందులు, ల్యాబ్ లను పరిశీలించడం జరిగిందన్నారు. ఇక్కడి ఏరియా అంత పేషంట్స్ ఇక్కడికే వస్తున్నారని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియన కలిసి అదనంగా 50 పడకలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయన అన్నారు. 50 పడకల పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపుతారని, SDF ఫండ్స్ కింద జిల్లా ఇంచార్జ్ మంత్రి గా హాస్పిటల్ కి లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. 24 గంటలు హాస్పిటల్‌లో విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, 108 అంబులెన్స్ హాస్పిటల్ కి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
10 డయాలిసిస్ బెడ్స్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వైద్యంలో అనేక సంస్కరణలు చేపట్టిందని, మా ప్రభుత్వం డాక్టర్లు ,నర్సు లో ,ల్యాబ్ అసిస్టెంట్ , ఫార్మసీస్ట్ ల నియామకాలు చేపట్టిందన్నారు. రోగుల ఆరోగ్యానికి నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని, శానిటేషన్ సిబ్బంది జీతాలు రాలేదంటే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశామన్నారు. మందులు అన్ని ఉన్నాయి.. గతం కంటే ఎక్కడ ఇబ్బందులు లేవని, ఫ్రీ మెడిసిన్ ఇవ్వడానికి టాప్ ప్రయారిటీ కల్పిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
MG Windsor EV: కొనుగోలుదారులకు షాక్.. కార్ల ధరను భారీగా పెంచేసిన ఎంజీ