కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే ఎల్లంపల్లి నుంచి నీరు పొదుపుగా వాడుకొని పెద్ద ఎత్తున వరి పంట పండించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఉంటే ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఆయన సూచించారు.
Ponnam Prabhakar: హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి డిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
Ponnam Prabhakar: రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారు.. ఆదాయం వచ్చే పంటలు వేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ గండి కొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల లెక్క తెలియకపోవడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు నియామకాల ప్రకారం బీసీ గణన నిర్వహిస్తున్నామన్నారు. కుల గణన ఎందుకు వద్దొ నేరుగా చెప్పండని కేటీఆర్ ని ప్రశ్నించారు. జీవో18 ప్రకారం మాదిరిగానే సర్వే జరుగుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని మరోసారి…
రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని మంత్రి పొన్నం ప్రభాకార్ స్పష్టం చేశారు.
అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి... ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.