Numaish 2025 : ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే నుమాయిష్ ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) – 2025ను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ విహెచ్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జనవరి 1న ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి వల్ల ఈరోజు ప్రారంభం అవుతుందని, జమ్మూ నుండి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లి కొనుక్కోవాలనుకున్న ఇక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ లో దొరుకుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Health Tips : కలబంద జెల్‌ను డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..
గతంలో ఎనిమల్ కంపీటిషన్ జరుగుతుండే దానిని మళ్ళీ ప్రారంభించాలని కోరారని, పాడి పంటలను ఎంకరేజ్ చేయాలన్నారు. విద్యా సంస్థలను ప్రోత్సహించడం లాంటివి ఈ కమిటీ చేస్తుంది ఇక్కడ నుమాయిష్ కార్యక్రమం జరుగుతుందని, నుమాయిష్ కి ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మా దగ్గర గిరిజనులు పెదలు ఉన్నారు మా దగ్గర ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేయండని, ఇప్పుడు 28 విద్యా సంస్థలు ఉన్నాయి వచ్చే నుమాయిష్ లోపు 30 కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Health Tips: గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన… జుట్టు పెరుగుదలకు ఏది ప్రయోజనకరం?