భద్రాద్రిలో రాములవారి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి అని పేర్కొన్నారు.
ఒకనాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అవుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోలీస్, స్టాఫ్ నర్స్, గురుకులం, సింగరేణి… మూడు నెలల లోపే 23 వేల ఉద్యోగాలను భర్తీ చేసాం, 63 అదనపు పోస్టులతో గ్రూప్ వన్ , 11062 పోస్టులతో మెగా డిఎస్పి నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాల భర్తీ…
టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే.. తొలి జాబితాలోనే టిక్కెట్ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల…
ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ ఇరికేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కేసీఆర్ సభకు రావాలని, ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప, వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు…
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్రెడ్డి..
ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా…
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం తగు చర్యలకు ఉపక్రమించిందని, ఆ దిశలో పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం కేరళ ప్రభుత్వ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్…
సచివాలయంలో ధరణి కమిటీతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని నిన్న తెలిపారు ధరణి కమిటీ సభ్యులు. ఈ నేపథ్యంలో మధ్యంతర నివేదికపై రెవెన్యూ శాఖ మంత్రి తో చర్చిస్తున్నారు కమిటీ సభ్యులు. రేపు సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాలు… మొత్తం నాలుగు జిల్లాల కలెక్టర్లతో రేపు సిసిఎల్ఎలో సమావేశం కానుంది ధరణి కమిటీ. ధరణిపై వీలైనంత…
హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఆర్భాటంగా ప్రారంభించిన పథకాల పైన చర్చ జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఇరిగేషన్ పైన చర్చించామన్నారు. మిషన్ భగీరథ, కాలువలు తవ్వని అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఫారెస్టు క్లియరెన్స్ కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించామన్నారు. అంతేకాకుండా.. 6 గ్యారెంటీల పథకాల కోసం సేకరించిన దరఖాస్తులు గురించి చర్చించామని మంత్రి పేర్కొన్నారు.