తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాన్ని అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ లైసెన్సుల పంపిణీ తొలి అడుగు.…
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. తాజాగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు.
Ministers : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 కి గంటలకు వీరిద్దరూ హెలికాప్టర్ లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని, తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహా జాతర పనుల పురోగతిపై సీతక్క తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి. ఈ సమీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మీటింగ్ తర్వాత…
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా రాష్ట్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన సమస్యలపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి…
Bhadrachalam: గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు…
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు.
Off The Record : ఆ ఉమ్మడి జిల్లాలో నీటి పోటీలు జరుగుతున్నాయా? క్రెడిట్ రేస్‌లో ముగ్గురు మంత్రులు పోటీలు పడుతున్నారా? ఒకరు ముందు, మరో ఇద్దరు కాస్త వెనకగా నీళ్ళు విడుదల చేయించి తమ ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నారా? ఎవరా మంత్రులు? ఏంటా క్రెడిట్ వార్? ఉమ్మడి ఖమ్మం జిల్లా పొలాలకు సాగునీరు ఇచ్చే విషయంలో మంత్రుల మధ్య క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా…
Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఈ తరహా అంశాలను కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని ముందుగానే మీడియాకు వెల్లడి చేయడం సరైంది కాదని…