సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500 ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. హుజూర్ నగర్ లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: TSPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పుల్లో ఉన్న రాష్టాన్ని అందరం కలిసి బయటికి తెచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరంలో చేసిన తప్పుడు విధానాలతో ప్రస్తుతం నీళ్లున్నా వాడుకోలేకపోతున్నామని తెలిపారు. గత పాలకుల శాపాలు ఇప్పుడు ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. భద్రాద్రి, యాదాద్రి పేరుతో దోచుకోవడానికి ప్రచారంలో బాగా వాడుకున్నారని ఆరోపించారు. ధరణిలో ఎలా ల్యాండ్ మాయ చేశారో త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Laxman: అభివృద్ధి ఎజెండాతో మోడీ ఎన్నికలకు వెళ్తున్నారు..