Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం తెచ్చిన ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో భాగంగా.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి పర్యటనలో భాగంగా పొంగులేటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం ఖమ్మం లోని ఎస్‌ఆర్ గార్డెన్స్ లో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అహంకారానికి ప్రజలు జవాబు ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో ఇచ్చారన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ వచ్చిందని తెలిపారు. జిల్లాకు ముగ్గురు మంత్రులను అధిష్ఠానం ఇచ్చారన్నారు. ఎన్నికలు అయ్యాక అన్ని హామీలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే వాగ్దానాలు అమలు చేశామన్నారు.
Read also: Nandigama: కంచికచర్లలో మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం..
వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఎవ్వరినీ ఇబ్బందులు పెట్టే పార్టీ కాదు కాంగ్రెస్ అన్నారు. అన్ని హామి లు నెరవేరుస్తామని హామి ఇస్తున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నామన్నారు. జిల్లాలో వున్న సమస్యలు పై ముఖ్యమంత్రి తో జిల్లా ప్రజలను తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. అధికారం, డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోతామన్నారు. శంకర్ గిరి మాన్యాలను ప్రజా ద్రోహులను పంపిస్తామన్నారు. అక్కడి నుంచి అనంతరం అక్కడి నుంచి మధ్యహ్నం పాలేరు టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 4గంటలకు కొత్తగూడెం క్యాంపు కార్యాలయానికి వెళ్లి దిశానిరద్దేశం చేయనున్నారు.
Break for Marriages: బ్యాచ్ లర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెళ్లి కావాలంటే 3 నెలలు ఆగాల్సిందే..