ముంబయిలో జరగబోయే సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ నాయకుడు.. అయితే కూటమిలో చేరే అవకాశం ఉన్నవారి పేర్లను వెల్లడించలేదు
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
రాజకీయ పార్టీలు ఇకపై తమ ఆడిట్‌రిపోర్ట్ లను భారత ఎన్నికల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నేరుగా ఈసీఐ వెళ్లి సమర్పించాల్సిన అవసరం లేకుండా తమ ఆడిట్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అవకాశం కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను మద్దతు కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన ఆయన నేడు ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో సమావేశం కానున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్ (సెక్యులర్)తో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేయడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఏ ఎన్నికలైనా ప్రచారం హోరెత్తుతుంది.. ఇక, ప్రచారం తర్వాత ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగుతోంది.. మాకు ఓటు వేస్తే ఇంత ఇస్తాం.. ఈ పనులు చేసిపెడతాం అనే వాళ్లు చాలా మందే మోపయ్యారు.. అయితే, వీటికి దూరంగా ఉంటుంది ఓ గ్రామంలో.. అంటే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారంటే.. ఓట్లను కూడా బహిష్కరించారా? ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే, వీరు ఎన్నికల ప్రచారానికి మాత్రమే వ్యతిరేకంగా.. అందరూ ఓటు వేయాల్సిందే.. ఒకవేళ ఓటు వేయకపోతే…