వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ…
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజకీయ ప్రకటనల విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పని సరి అని సీఈవో రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు.
లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎటువంటి ప్రచార సామాగ్రిలో పిల్లలను ఏ రూపంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ.. అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను ఉపయోగించుకోవడం పట్ల ఎన్నికల సంఘం "జీరో…
30వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ్టి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఈ బాండ్లను ప్రవేశ పెట్టింది.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు.
పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు.