ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం మరియు పంపిణీ చేయడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని వ్యాఖ్యానించింది..
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నిపుణుల సంఘం ఏర్పాటుపై వారంలోగా సూచలు ఇవ్వాలని పేర్కొన్నారు
అక్కడ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారా? డాక్యుమెంట్ కదలాలంటే కాసులు ముట్టజెప్పాల్సిందేనా? కొర్రీలు పెట్టి మరీ డబ్బులు దండుకున్నది ఎవరు? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్‌ఛార్జ్ ల పాలన ఇంకెన్నాళ్ళు. డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? వివిధ పార్టీల నాయకులు వారికే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల తీరు విమర్శల పాలవుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇంచార్జ్ ల…
మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అయోధ్యలో ఈ నెల 9వ తేదీన జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతేకాకుండా జనవరి 7 మరియు జనవరి 8న ఉత్తరప్రదేశ్‌లోని గోండా మరియు బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు అఖిలేష్.. కాగా, యూపీలో…
క్రిమినల్ రికార్డులు ఉన్న నేతలే.. ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపడుతున్నారు.. ప్రజలను పాలిస్తున్నారు.. అయితే, రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం… ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన…