ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై దాడి అంశాన్ని ఆ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకువెళ్లగా… తాజాగా టీడీపీపై వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు టీడీపీపై ఫిర్యాదు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, తక్షణమే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Read Also: ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటాం:…
డ్రగ్స్ విషయంలో ఏపీలో రాజకీయ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డ్రగ్స్‌ను అధికార పార్టీ నేతలే సరఫరా చేయిస్తున్నానరని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేందుకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిన్నమెదడు చిట్లినట్లు ఉందని.. ఆయనకు మతిపోయిందని కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడనే అనుమానం ఉందని……
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. హుజురాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతు ఇచ్చినా, బీజేపీకి ఓటు వేసినా…
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. సానుభూతి వస్తుందనుకుంటే జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని ఆయన ఆరోపించారు. పట్టాభి తిట్టింది జగన్‌ను కాదని.. సజ్జలను అని.. సానుభూతి కోసం జగన్ తననే అన్నారని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఓట్లు, సీట్లు వస్తాయని గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు కూడా పట్టాభి తిట్టిన బోసిడీకే…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల…
ఈటెలను రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు అధికార పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడ్డాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు ఆ రెండు పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటెల, తాను కలిసిన మాట నిజమేనన్నారు. అయితే తాము చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మే 7న…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రహస్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాళ్లిద్దరూ హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హోటల్లో కలిశారన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్‌ను కలిసిన మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు కాదన్నారు. Read Also: మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి రాజాసింగ్…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకరమైనదని అభివర్ణించారు. ఎవరు ఎమ్మెల్యే ఉండాలి అనేది కాదు… ఈ రాష్ట్రం ఎటు పోవాలి అనే దాని కోసం ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఇంతమంది జనం చూసిన తర్వాత ఇంకా ఎన్నిక నిర్వహించడం అవసరమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ జనం చూసి కేసీఆర్…
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి, కేంద్రమంత్రులకు చంద్రబాబు వివరించనున్నారు. ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరనున్నారు. Read Also: విశాఖ టూర్… వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్ కాగా వైసీపీ కార్యకర్తలు…
వైసీపీ సర్కారుపై మరోసారి టీడీపీ నేత లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయాలని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారని సెటైర్ వేశారు. కొన్ని పిల్లులు పులులమని అనుకుని భ్రమపడుతున్నాయని లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని చెప్పిన ఆయన.. తమ పార్టీ కార్యాలయంలో పగిలినవి అద్దాలేనని.. కానీ తమ కార్యకర్తల గుండెలను బద్దలు కొట్టలేరని…