ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుప్పంలో వాతావరణం పొలిటికల్‌గా హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పాగా వేయాలని అధికార పార్టీ వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. కుప్పంలో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని ఇప్పటికే నారా లోకేష్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు లోకేష్‌కు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా…
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజా పరిస్థితిని గమనిస్తే…. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి… వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక… 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి…
జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి…
హైదరాబాద్‌లోని కొంపల్లిలో కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ముందే రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. తమకు శిక్షణ తరగతుల పాసులు ఇవ్వలేదని ఆందోళన చేశాయి. జనగామ నియోజకవర్గ పరిధిలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని ఆరోపించాయి. బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను కాదని కొత్త వారికి ఇచ్చారని మండిపడ్డాయి. పొన్నాల లక్ష్మయ్య మనుషులకు మాత్రమే ఇచ్చి తమను దూరం…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్‌లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. Read…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్,…
తన ఫాం హౌస్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పదే పదే తన ఫాం హౌజ్‌ను దున్నుతా అంటున్నావ్.. నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్‌వా? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. చట్టం ప్రకారం కొన్న తన ఫాం హౌజ్ ముందు అడుగు పెడితే ఆరు ముక్కలవుతావని హెచ్చరించారు. అయినా తనది ఫాం హౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను వ్యవసాయం చేసే కుటుంబంలో…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. 20 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు పాల్పడిన ఘటనలను ఎవరూ మరిచిపోలేరని.. తాను విదేశాలకు పారిపోయానని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపారు. తన కుటుంబంపై దాడి జరిగిన తర్వాత తన కుటుంబంతో కలిసి తాను బయటకు వెళ్లానని.. అంత మాత్రానికే తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదంటూ పేటీఎం బ్యాచ్ తెగ సంబరపడిపోతుందని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీతో…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని మండిపడ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అబద్దాలే మాట్లాడారని.. ఈ అబద్దాలు చెప్పేందుకే ప్లీనరీలు, బహిరంగసభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతులను ఆగమాగం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ అవుతుందో…
కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా కేసీఆర్‌కు ఎప్పుడు కోపం వచ్చినా బీజేపీని తిట్టడం ఆయనకు ఫ్యాషన్ అయిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయం అని చెప్పిందని రఘునందన్‌రావు గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా…